5626) పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు

** TELUGU LYRICS **

పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు 
ఆటంకాలెదురైనా వెనుతిరిగి చూసుకోదు 
నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే  వీడిపోదు 
నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు
||పవిత్రమైన ప్రేమ||

అ.ప: నీకోసం బ్రతికేసింది నీకోసం మరణించింది.
సరిహద్దులే చెరిపేసింది పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది
ఆ ప్రేమే నిన్ను కన్నది ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది (2)
ఆ ప్రేమే నిన్ను కన్నది అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది 

ప్రేమ పిచ్చిదేమో పిచ్చిదేమో యేసుప్రేమ
ఇల్లును వదిలి పల్లె పల్లేనా తిరిగింది ఆ ప్రేమ
తల్లిని విడిచి పగవారి ప్రేమకై ఎదురుచూసింది ఆ ప్రేమ 
ఆకలి మరచి ఆ భాగ్యలకై అలమటించిందా ప్రేమ
ఉమ్మి వేసినా ఈడ్చివేసినా విడిచి పెట్టలేదు ప్రేమ
ఊరి చివరనే చేతులు చాచి నీకై నిలిచిందా ప్రేమ
||ఆ ప్రేమే నిను||

ప్రేమ గుడ్డిదేమో గుడ్డిదేమో యేసు ప్రేమ పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ 
వ్యభిచారిని సహితం చంపొద్దు అంటూ క్షమించిందా ప్రేమ 
వెన్నుపోటులే ఎన్ని పొడిచిన మిన్నకుండింది ప్రేమ
ప్రాణ ఆత్మలే ధారపోసింది రిక్తునిగా మారింది ప్రేమ 
సిలువ వేసినా చీల్చివేసినా మౌనం దాల్చింది ప్రేమా..ప్రేమా..ప్రేమా
||ఆ ప్రేమే నిను|| ||పవిత్రమైన ప్రేమ||

** ENGLISH LYRICS **

Pavithramaina Prema Maranathotho Mugisipodhu
Aatankaaledurainaa Venuthirigi Choosukodhu
Nuvvu Enthagaa Nindisthunnaa Ninnae Veedipodhu
Nuvvu Nirlakshyam Chesthunnaa Ninnae Edabaayadhu
||Pavithramaina Prema||

Chorus: Neekosam Brathikesisindhi Neekosam Maraninchindhi
Sarihaddulae Cheripesindhi Paramuku Ninnu Chaerusthoo Unnadhi
Aa Premae Ninnu Kannadhi Aa Premae Rakthamichchi Ninnu Konnadhi (2)
Aa Premae Ninnu Kannadhi Anunithyam Ninnu Kaasthoo Unnadhi 

Prema Picchidhaemo Picchidhaemo Yaesu Prema
Illunu Vodhili Palle Pallenaa Thirigindhi Aa Prema
Thallini Vidichi Pagavaari Premakai Edhuruchoosindhi Aa Prema
Aakali Marachi Aa Bhaagyalakai Alamatinchindhaa Prema
Ummi Vaesinaa Eedchivaesinaa Vidichi Pettalaedhu Prema
Oori Chivaranae Chaethulu Chaachi Neekai Nilichindhaa Prema
||Aa Premae Ninu||

Prema Gudhidhaemo Gudhidhaemo Yaesu Prema Paapulathonae Paapula Madhyalo Thirigindhi Aa Prema
Vyabhichaarini Sahitham Champoddhu Antoo Kshaminchindhaa Prema
Vennupootulae Enni Podichina Minnakundindhi Prema
Praana Aathmalae Dhaaraposindhi Rikthunigaa Maarindhi Prema
Siluva Vaesinaa Cheelchivaesinaa Mounam Daalchindhi Premaa.. Premaa.. Premaa
||Aa Premae Ninu|| ||Pavithramaina Prema||

-------------------------------------------
CREDITS : Music : Gideon
Lyrics : Bro. Krishna Kumar
-------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post