5280) ఇదే చివరి దినమైతే ఎటు వైపో నీ ప్రయాణం

** TELUGU LYRICS **

ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం
అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.

వుండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో (2)
జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో 
అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ 

ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా (2)
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు 
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు (2)
సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని 
నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు 
||ఇదే||

తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా (2)
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు 
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు (2)
నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు 
తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకొని రావయ్యా
||ఇదే||

క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా (2)
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో (2)
సంచరించుటకూ నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము
||ఇదే||

** ENGLISH LYRICS **

Idhae Chivari Dhinamaithe - Etu Vaipo Nee Prayaanam
Adhae Paatha Brathukaithe - Rakshana Pondhina Vyardham.

Vundhedhevaru Poayedhevaru Oogisalaatalo
Maranamu Techukunnaamu Kadhaa Eaedhenu Thootalo (2)
Jeevamu Digivacchindhi - Prabhu Yaesuni Roopamlo 
Avakaashamu Manakocchindhi - Paraloakamu Chaerutaku 

Aedhi Needhi Aedhi Naadhi Aedhi Manadhayyaa
Unnavi Annee Poayaevanani Cheppenu Yaesayyaa (2)
Chaepa Noatilo Shekelu Undhani Telisina Aayanaku 
Srushtilo Bahusampadha Undhani Teliyadhaa Yaesunaku (2)
Siriki Dhevuniki Dhaasulugaa Undalaemani 
Naaku Naerpinchalani Thaanu Koduva Kaligi Jeevinchaadu 
||Idhae||

Thallini Vidichina Jeevaraashulu Thirigi Raavayyaa
Rekkaluvacchi Egiri Poathe Gathamae Gurthuku Raadhayyaa (2)
Ninnu Vidichina Nee Pillalu Ninnu Choodaga Vasthaaru 
Dhooramu Bhaaramu Anukookondaa Ninnu Choosi Velathaaru (2)
Nee Thandrini Choochutaku Paraloakam Chaerutaku 
Thappipoayina Kumaarudaa Thappu Dhiddukoni Raavayyaa
||Idhae||

Kreesthu Vocchae Vaela Ayinadhi Siddapadavayyaa
Aathmeeyamaina Yaathralo Baatasaarivi Neevayyaa (2)
Nee Dukhadhinamulanu Aanandhamugaa Maarchae Dhevunitho
Raathri Laeni Loakamulo Nithyamu Yaesuni Velugulo (2)
Sancharinchutaku Nuvu Santhoashinchutaku
Noothanamugaa Janminchi Neethi Vasthramunu Dharinchumu
||Idhae||

---------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : K. SatyaVeda Sagar 
Vocals & Music : Dhanunjay & P. Prasanth 
---------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post