5279) ఏ యోగ్యత లేని వాడను నీ ప్రేమతో ఆదరించుమా

** TELUGU LYRICS **

ఏ యోగ్యత లేని వాడను నీ ప్రేమతో ఆదరించుమా (2)
లోకమనే ఎడారిలో ఎండమావిని శోకమనే నిశీధిలో నిలిచియుంటిని (2)

ఆకులు రాలి ఫలములు లేని ఎండిన మోడునై నేను ఉంటిని (2)
ఎవరికిగాక ఏ దరి లేక వ్యర్ధముగా ఇలలో బ్రతుకుచుంటిని 
ఆర్తద్వని ఆలకించవా (2)
తండ్రి నన్నాదరించవా (2)  
||ఏ యోగ్యత||

హోరున వీచే పెనుగాలైనా అనగిపోవును నీ మాటతో (2)
హృదయవేదన తొలగిపోవును నెమ్మది కలిగించె నీ ఆత్మతో 
ఆర్త ధ్వని ఆలకించవా (2)
తండ్రి నన్నాదరించవా (2)
||ఏ యోగ్యత||

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------