4532) క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను క్రిస్మస్ తారలతో నా ఇల్లు నిండెను

** TELUGU LYRICS **

క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
క్రిస్మస్ తారలతో నా ఇల్లు నిండెను (2)
ఊరువాడంతా (3) 
సంబరాలు చేయగా
రారాజు రాకను లోకమంతా చాటెదం
రండో రారండో రక్షకుడు పుట్టెను
రండో రారండో జగమంతా చాటెదము (2)
||క్రిస్మస్||

తూర్పు దిక్కున చుక్క పెట్టెను
లోకరక్షకుని జాడ తెలిపెను
తూర్పుదిక్కున చుక్కను చూసె ను
జ్ఞానులంతా కలిసి యేసుని చేరెను (2)
తూర్పుదిక్కు నుంచి దూత వెళ్లెను
లోకమంతా క్రీస్తు వార్త తెలిపెను
తూర్పుదిక్కున గొల్లలంతా చేరెను
రారాజు పెట్టెనని లోకానికి చాటేను
||ఊరువాడంత||  ||క్రిస్మస్ సంతోషం||

రాజుల రాజుగా యేసు పుట్టెను
లోక పాపమంతా తుడిచి వేసెను
రాజుల రాజుగా క్రీస్తు వచ్చెను
లోక మంతటికి రక్షణ తెచ్చెను (2)
రాజుల రాజు మాట పలికెను
బంధకాల నుండి విడుదల కలిగెను
రాజుల రాజు ప్రేమ చూపెను
దిక్కు లేనివారికి దారి చూపెను
||ఊరువాడంత||  ||క్రిస్మస్ సంతోషం||

** ENGLISH LYRICS **

--------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : N. Gideon ARMY 
Vocals & Music : Joshua Rambabu Gariki & Prasanth Penumaka
--------------------------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post