4533) యేసయ్య పుట్టాడని రక్షకుడు వచ్చాడని సంబరాలు చేసుకుంటూ

** TELUGU LYRICS **

యేసయ్య పుట్టాడని రక్షకుడు వచ్చాడని
సంబరాలు చేసుకుంటూ
సందడని గంతులేస్తూ (2)
సత్యమును నీవు మరిచావా
గొప్ప సత్యమును నీవు మరిచావా (2)
విశ్వాసము లేని క్రియలు
మృతమని తెలుసుకో (2)
మనసుని మార్చుకో నీ మనసుని మార్చుకో (2)
||యేసయ్య||  
          
పంటికి పని పెట్టావు
ఇంటికి రంగులు వేశావు
దేహమును అలంకరించావు 
గొప్ప పండుగని గొప్పలు చెబుతావు (2)             
అందముగా మారావు అన్ని అందముగా మార్చావు (2)
యేసుని స్వికరించావా
రక్షణ నీవు పొందవా (2)  
||విశ్వాసము||

ఇంటిపైన స్టార్ పెట్టావు
ఇంటిలోన బారు పెట్టావు   
ఇంటినంత వెలిగించావు
గొప్ప పండుగని ఖర్చులు చేస్తావు (2)
భోధలెనో నీవు విన్నావు
బాగున్నాయి అని అన్నావు (2)
యేసుని స్వికరించావా
రక్షణ నీవు పొందవా (2)
||యేసయ్య||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. G. Phinehas 
Vocals & Music : Vijay Polamati & Paul Enosh Manti
--------------------------------------------------------------------------------