4503) బేత్లహేములో పండుగ పండుగ పశులపాకలో పండుగ పండుగ

** TELUGU LYRICS **

బేత్లహేములో పండుగ పండుగ
పశులపాకలో పండుగ పండుగ (2)
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త  (4)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని (2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం

తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి 
ఆనందభరితులై ఆర్బటం చేసిరి (2)
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి (2)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని (2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం

రాత్రివేళ కనబడేను ప్రభుదూత గొల్లలకు 
చాటింప చెప్పిరి శుభవార్తమానము ( 2)
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు (2)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని (2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం

--------------------------------------------
CREDITS : Anjali Evangelist
--------------------------------------------