4256) సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు


** TELUGU LYRICS **

సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు 
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి 
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి
యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే

సిలువ సునాదమును నా శ్రమ దినమున
మధుర గీతికగ మదిలో వినిపించి
సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి
కాంతిమయముగ కనపరచితివే నీ ఆత్మ శక్తితో
||సద్గుణ||

నా తోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి
చీకటి దాచిన - వేకువగా మార్చి
బలమైన జనముగ నిర్ధారించితివి నీ కీర్తి కొరకే
||సద్గుణ||

నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై 
||సద్గుణ||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post