** TELUGU LYRICS **
యేసయ్యా! నను కోరుకున్న నిజస్నేహితుడా
నీ యౌవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా!
నిను ఆరాధింప నా బలమా!
మది మందిరాన కొలువైనా నా వరమా !
నా పూర్ణ హృదయముతో నిను వెదకితిని
నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనియ్యకుము
ధైర్యమునిచ్చే - నీ వాక్యముతో
నీ బలమును పొంది - దుష్టుని ఎదురింతును
||యేసయ్యా||
నా గురి గమ్యమైన నిను చేరుటకు
ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు - బహుమానముకై
నా సిలువను మోయుచు నిను వెంబడించెదను
||యేసయ్యా||
నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తి ప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును
||యేసయ్యా||
నీ యౌవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా!
నిను ఆరాధింప నా బలమా!
మది మందిరాన కొలువైనా నా వరమా !
నా పూర్ణ హృదయముతో నిను వెదకితిని
నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనియ్యకుము
ధైర్యమునిచ్చే - నీ వాక్యముతో
నీ బలమును పొంది - దుష్టుని ఎదురింతును
||యేసయ్యా||
నా గురి గమ్యమైన నిను చేరుటకు
ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు - బహుమానముకై
నా సిలువను మోయుచు నిను వెంబడించెదను
||యేసయ్యా||
నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తి ప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును
||యేసయ్యా||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------