** TELUGU LYRICS **
నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్య
అపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా
చెరనుండి విడిపించి చెలిమితో బంధించి
నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును
నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకెళ్ళ సంబరాలు మూగబోయెను
నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందబారితులై సీయోనుకు తిరిగివచ్చెను
||నమ్మదగిన||
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సంమృద్ధి జీవముతో పోషించితివి
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాఆదరణను పొంది నీ క్రియలను వివరించగా
||నమ్మదగిన||
నా బలహీనతయందు శ్రేష్ఠమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి
అర్హమైన పాత్రగా నను నిలుపుకుంటివి
ఆదరణకర్తవైన విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము
||నమ్మదగిన ||
అపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా
చెరనుండి విడిపించి చెలిమితో బంధించి
నడిపించినావే మందవలె నీ స్వాస్థ్యమును
నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకెళ్ళ సంబరాలు మూగబోయెను
నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందబారితులై సీయోనుకు తిరిగివచ్చెను
||నమ్మదగిన||
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సంమృద్ధి జీవముతో పోషించితివి
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాఆదరణను పొంది నీ క్రియలను వివరించగా
||నమ్మదగిన||
నా బలహీనతయందు శ్రేష్ఠమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి
అర్హమైన పాత్రగా నను నిలుపుకుంటివి
ఆదరణకర్తవైన విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము
||నమ్మదగిన ||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------