4272) నా దాగుచోటు నీవే యేసయ్యా నా విచారములు కొట్టివేసి



** TELUGU LYRICS **

    నా దాగుచోటు నీవే యేసయ్యా (2)
    నా విచారములు కొట్టివేసి - ఆనందము కలుగజేసితివి (2)
    నాహృదయములో నదివలే సమాధానమే 
    నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే

    తగిన సమయములో హిచ్చించునట్లు నను దాచి కాచితివి (2)
    దీనమనస్సు కలిగి జీవింప నీకృపనిచ్చితివి (2)
    నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి (2)
    నా హృదయములో నదివలే సమాధానమే 
    నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
    ||నా దాగుచోటు||

    ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి (2)
    నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును (2)
    నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును (2)
    నా హృదయములో నదివలే సమాధానమే 
    నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
    ||నా దాగుచోటు||

    అగ్నిశోధనలు నను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో (2)
    స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి (2)
    జేష్ఠుల సంఘముకై నను సిద్ధపరచితివి (2)
    నా హృదయములో నదివలే సమాధానమే 
    నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే
    ||నా దాగుచోటు||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post