** TELUGU LYRICS **
దీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా - పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని - శృతిమించి పాడనా
జీవధారవు నీవని - కానుకనై పూజించనా
అక్షయదీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చణ చేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే
పూజ్యుడా - పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని - శృతిమించి పాడనా
జీవధారవు నీవని - కానుకనై పూజించనా
అక్షయదీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చణ చేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే
||దీనుడా అజేయుడా||
సమ్మతి లేని సుడిగుండాలే - ఆవరించగా
గమనము లేని పోరాటాలే - తరుముచుండగా
నిరుపేదనైన నా యెడల - సందేహమేమి లేకుండా
హేతువేలేని - ప్రేమ చూపించి -సిలువ చాటునే దాచావు (2)
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతి మాలిక నీకే - వజ్ర సంకల్పము నీవే

సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా
విరిగి నలిగిన మనసుతో - హృదయార్చనే చేసెదా
కరుణ నీడలో - కృపా వాడలో -నీతో ఉంటే చాలయ్యా (2)
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా

ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీ సన్నిధిలో -క్రొత్త కీర్తనే పాడెదను (2)
ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా
||దీనుడా అజేయుడా||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------