** TELUGU LYRICS **
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా (2)
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే - నాకిలలోన సంతోషమే
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే - నాకిలలోన సంతోషమే
||బహు సౌందర్య||
పరిశుద్ధతలో మహనీయుడవు - నీ వంటి దేవుడు జగమున లేడు (2)
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ - నీకే నా హృదయార్పణ (2)
||బహు సౌందర్య||
ఓటమి నీడలో క్షేమము లేక - వేదన కలిగిన వేళలయందు
ఓటమి నీడలో....
ఓటమి నీడలో క్షేమము లేక - వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే - నా హృదయాన నవ జ్ఞాపిక (2)
||బహు సౌందర్య||
ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీ చూపే ఔషధమే
ఒంటరి బ్రతుకులో....
ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీ చూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే (2)
||బహు సౌందర్య||
--------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album : Adviteeyudaa (అద్వితీయుడా)
--------------------------------------------------------------------------