4037) యెహోవాయే దయాళుడు ఆయనను స్తుతించెదము (190)

** TELUGU LYRICS **
  
    యెహోవాయే దయాళుడు 
    ఆయనను స్తుతించెదము 

1.  ఇరుకునందుండి నేను మొఱ్ఱపెట్టు 
    స్ధలమందు నా మొఱ్ఱ నాలించెన్ 
    యెహోవాయే నా రక్షణదుర్గం 
    ఆయనయే నా ఆనందగానం 
    ఆయనను పూజించెదము 

2.  మనుష్యుల నమ్ముటకంటె యెహోవాను 
    ఆశ్రయించుట నాకెంతో మేలు 
    యెహోవాయే నా పక్షము నుండ 
    నరులు నాకేమి చేయగలేరు 
    ఆయనకే కృతజ్ఞతల్ 

3.  ఇల్లుకట్టువారు నిషేధించిన రాయి 
    మూలకు తలరాయి ఆయెను 
    ఇది దేవుని వలన కలిగిన కార్యం 
    అది మన కన్నులకు ఆశ్చర్యం ఎంతో 
    ఆయనను కీర్తించెదము 

4.  ఇది యెహోవా ఏర్పరచిన దినము 
    దీనియందు మనము ఉత్సహించి 
    మా పట్ల చేసిన ఇన్ని మేలులకై  
    నిరతము నిలచే మీ ఉన్నత కృపకై 
    ఇవియే మా వందన స్తుతులు 

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post