3707) బెత్లెహేము పురమందున రారాజు పుట్టాడంట

    

** TELUGU LYRICS **

    బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట 
    రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం.....
    ఆడి పాడి ఆనందిద్దాం.......
    బెత్లెహెము పురమందున  - రారాజు పుట్టాడంట 
    రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం (2)
    కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం (2)
    అ.ప:ఆనందం పరమానందం - నింగీ నీలా పరవశం(2) 
    ||బెత్లెహేము||

1.  గొల్లలకు శుభవార్త  - అభయమిచ్చి దూత చెప్పింది 
    దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని (2)
    దివియందు  దేవునికి మహిమ - భువియందు సమాధానం (2)
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం  
    ||ఆనందం|| ||బెత్లెహేము||

2.  పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు 
    పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ (2)
    కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ (2)
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం
    ||ఆనందం|| ||బెత్లెహేము||

3.  నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది 
    రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి (2)
    రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం (2)
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం
    ||ఆనందం|| ||బెత్లెహేము||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------