3706) నా యేసునాధ నీవే నా ప్రాణదాత నీవే

 
    
** TELUGU LYRICS **

    నా యేసునాధ నీవే - నా ప్రాణదాత నీవే 
    నీ ప్రేమ చాలు నాకు   
    నా దాగుచోటు నీవే యేసయ్య 
    నా జీవితాంతము నిన్నే స్తుతింతును 
    నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును 
    ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము 
    ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము 
    నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే 
    నీ ప్రేమ చాలు నాకు    
    నా దాగుచోటు నీవే యేసయ్య 
    నా దాగుచోటు నీవే యేసయ్య 

1.  ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా 
    నీలో నిరీక్షణే - బలమైనదీ
    ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
    నీ జీవవాక్యమే - వెలుగైనదీ
    నీ సన్నిధానమే - సంతోష గానమై
    నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై 
    భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా  
    గానమై - రాగమై 
    అనుదినము నిన్నే - ఆరాధింతును 
    కలకాలం నీలో - ఆనందింతును

2.  కొనియాడి పాడనా - మనసార వేడనా 
    నీ ప్రేమ మాటలే - విలువైనవీ
    ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
    నా యందు నీ కృప - ఘనమైనదీ 
    నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం 
    నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం 
    నీ పాద సేవయే - నాలోని ఆశగా 
    ప్రాణమా - జీవమా 
    అనుదినము నిన్నే - ఆరాధింతును 
    కలకాలం నీలో - ఆనందింతును

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------