3612) యేసు నీ అద్భుత ప్రేమ నేనేల మరిచెద దేవా


** TELUGU LYRICS **

1.  యేసు నీ అద్భుత ప్రేమ నేనేల మరిచెద దేవా
    నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి యెరిగినవాడను
    ఎండిన నా బ్రతుకులో జీవముగా నీవు చేరితివి
    నీ ప్రేమ జలములతో నను తడిపి బ్రతికించితివి

    నీ వాత్సల్యమును - నీ కారుణ్యమును 
    స్మరియించుచు దేవా
    నే పాడేదనూ స్తుతి గీతము
    నే పాడేదనూ స్తుతి గీతము
    ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు
    కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి

2.  పాపమును ఎరుగని దేవా నాకై పాపముగా మారి
    నా వ్యసనములను భరియించి సిలువలో ప్రాణము విడిచితివి
    అమూల్యమైన నీ రక్తముచే నను నీవు విమోచించితివి
    నీ ప్రేమ లోతులలో శాశ్వతముగా నను బందించితివి

    నీ కల్వరి యాగం - కనపరచిన ప్రేమ
    తలపోయుచు దేవా
    నే పాడేదనూ స్తుతి గీతము
    నే పాడేదనూ స్తుతి గీతము
    ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు
    కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post