3613) నా ప్రాణమా దిగులెందుకు నీ రక్షకుని స్మరియించుకో

** TELUGU LYRICS **

    నా ప్రాణమా దిగులెందుకు 
    నీ రక్షకుని స్మరియించుకో 
    మహిమోన్నతుడు బలవంతుడు 
    నీ పక్షమునే నిలిచెనుచూడు
    లెవరా వీరుడా నిరాశను వీడరా నీ రాజు నిన్ను పిలిచెను
    కదులు ముందుకు కదులు ముందుకు
    అసాధ్యుడే నీకుండగా అసాధ్యము నీకుండునా
    భయము వీడి నడవరా జయమునీదే జయమునీదే
    ||నా ప్రాణమా||

1.  యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
    విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
    లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
    యేసు నీతో ఉండును  నీ సహాయమాయనే
    నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
    నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2)
    ||నా ప్రాణమా||

2.  గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
    ఎదురుతిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
    జయించెనేసు ఏన్నడో సాతాను ఓడిపోయెను
    నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
    నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు 
    నిర్భయముగా సాగిపో  నీన్ను ఆపలేరు ఎవ్వరు (2)
    ||నా ప్రాణమా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------