2825) యేసువలె ఇల నేనుండెదను యేసువలెను

** TELUGU LYRICS **

    యేసువలె ఇల నేనుండెదను యేసువలెను

1.  శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు
    నేను 
    ||యేసువలెను||

2.  భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై
    నేను
    ||యేసువలెను||

3.  సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు
    నేను
    ||యేసువలెను||

4.  ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై
    నేను
    ||యేసువలెను||

5.  ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు
    పైకి జూతును నేను
    ||యేసువలెను||

6.  నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో
    నేర్తును
    ||యేసువలెను||

7.  వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున
    నేను
    ||యేసువలెను||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------