2753) యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము

** TELUGU LYRICS **

    యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము
    దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా 
    ||యేసుని||

1.  నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే
    నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్
    ||యేసుని||

2.  పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము
    బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను
    ||యేసుని||

3.  అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్
    కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు
    ||యేసుని||

4.  శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు
    లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్
    ||యేసుని||

5.  బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ
    ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని
    ||యేసుని||

6.  అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును
    నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప
    ||యేసుని||

7.  ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే
    దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్
    ||యేసుని||

8.  యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన
    నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్
    ||యేసుని||

** ENGLISH LYRICS **

Yesuni Korakai Ila Jeevincheda Bhaasuramuga Nae Anudhinamu
Doasamulanniyu Baapenu Moksha Ni Vaasamuna Prabhu Jaerchunugaa
||Yesuni||

1. Naashanakaramagu Guntaloanundiyu Moasakaraambagu Yoobinundi Naashachae
Nilapai Keththenu Nannu Pi Shaachi Pathambuna Dholaginchen
||Yesuni||

2. Paluvidhamula Paapambunu Jaesithi Valadhani Droasithi Vaakyamunu Kalushamu
Baapenu Karunanu Bilichenu Siluvalo Nannaakarshinchenu
||Yesuni||

3. Alayaka Solayaka Saagipoadhunu Velayaga Naa Prabhu Maargamulan
Kaligenu Nemmadhi Kaluvarigirilo Viluvagu Rakthamu Chindhinchina Prabhu
||Yesuni||

4. Shoadhana Baadhalu Shramalila Kalguina Aadukonunu Naa Prabhuvunisham Vyaadhulu
Laemulu Maranamu Vachchina Naadhudae Naa Nireekshanagun
||Yesuni||

5. Buddhi Vignaana Sarvasampadhalu Gupthamai Yunnavi Prabhunandhu Adhbhutamuga
Prabhu Vanniyunosagi Dhiddhunu Naa Brathukanthini
||Yesuni||

6. Arpinchenu Dhana Praanamunaakai Rakshinchenu Naa Priya Prabhuvu Arpinthunu
Naa Yaavajjeevamu Rakshaku Daesuni Saevimpa
||Yesuni||

7. Prabhunandhaananthinthunu Nirathamu Praarthana Vignaapanamulatho Vibhudae
Deerchunuyilanaa Chinthalu Abhayamutho Sthuthiyunthu Prabhun
||Yesuni||

8. Yauvana Janamaa Idhiyae Samayamu Yesuni Chaatanu Raarandi Paavana
Naamamu Parishudhdha Naamamu Jeevapu Maargamu Prachurimpan
||Yesuni||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------