2612) యేసు నీదు జాలివల్ల లెక్క లేనివారలు

** TELUGU LYRICS **

1.  యేసు, నీదు జాలివల్ల
    లెక్క లేనివారలు
    రక్షణంది సంతసిల్ల
    నిమ్ము వారి డెందముల్
    నీదు సిల్వ వంతవార్తఁ
    జాటఁజేసి రాష్ట్రముల్
    చూడ నిమ్ము త్రాణకర్త!
    నీ కృపా ప్రకాశముల్

2.  ఏమియున్ గ్రహింపకున్న
    మర్త్యు డెంద మాశతో
    నిన్ను ఁ గూర్చి తృష్ణ గొన్న
    యాత్మ యేడ్చు మెండుగా
    కోయఁబడ్డ గడ్డి మంచుఁ
    గోరునట్లు పాపులు
    నీవె రక్షకుండ వంచు
    నిన్ సదా యాశింతురు.

3.  ద్వీపవాసు లెత్తి కేలు
    కోరుచుందు రిప్పుడు
    నీదు సేవకాళి నంపి
    యాత్మ క్రొంత్త జన్మమున్
    ప్రేమదీప్తి జ్ఞానకాంతిఁ
    గల్గం జేయు వాక్యము
    నిచ్చి గొఱ్ఱె పిల్ల కీర్తిన్
    వారి నోట నుంచుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------