2587) యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం

** TELUGU LYRICS **  

    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం (2)
    మరణమైన శ్రమ ఎదురైనా - బెదిరిపోని విశ్వాసులం (మేం) 
(2)
    మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం 
(2)
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) 
(2)
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం

1.  షద్రకు మేషకు అబెద్నగోలను - అగ్ని గుండంలో త్రోయబోగా 
(2)
    నెబుకద్నెజెరు మాకు చింతయే లేదులే - మా .. దేవుడు మమ్మును రక్షించులే 
(2)
    అని తెగించి విశ్వసించి - ముగ్గురు నలుగురై జయించిరే (వారు) 
(2)
    మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
    మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) 
(2)
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం

2.  శత్రు సైన్యము దండెత్తి వచ్చెగా - యెహొషపాతు ప్రార్థన చేసెగా 
(2)
    యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా - భయమే లేక వారు జయ గీతం పాడెగా 
(2)
    ఆత్మతోన స్తుతియిస్తుండా - దేవుడే యుద్ధం జరిగించెగా (వారు) 
(2)
    మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు)
    మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) 
(2)
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం


3.  శత్రు గొల్యాతు సవాలు విసెరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా 
(2)
    ఒక్క దావీదే రోషముతో లేచెగా - జీవము గల దేవుని నామాన్నీ చాటెగా 
(2)
    చిన్న రాయి వడెసెతోన - ఆత్మ శక్తితో జయించెగా (హే) 
(2)
    మా యేసుడే మా బలం (యేసు) - మా యేసుడే మా జయం (యేసు) 
(2)
    మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం
    ప్రాణమిచ్చి మృతిని గెల్చిన - యేసు రాజే మా విజయం (తన) 
(2)
    యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం 
(2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------