** TELUGU LYRICS **
యేసయ్య నిను చూడాలని
యేసయ్య నిను చేరాలని
యేసయ్య నీతో ఉండాలని
యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది - నా మనస్సు
తృష్ణగొనియున్నది - నా హృదయం
ఎటుచూసిన పాపమే - చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే - పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని - నీతో ఉండాలని
ఆశగొనియున్నది - నా మనస్సు
తృష్ణగొనియున్నది - నా హృదయం
||యేసయ్య||
యదవాకిట శోదనే - ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే - కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని - నీతో ఉండాలని
ఆశగొనియున్నది - నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం
||యేసయ్య||
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా)
---------------------------------------------------------------------------------------