3056) వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవులను

** TELUGU LYRICS **

    వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవులను వారి కవి యెంతో ధైర్యముల్
    మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ
    చనుదెంచె వారిపై 
    ||వినరే||

1.  పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర
    ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై
    తన్నాదము
    ||వినరే||

2.  అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు
    ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను
    నింపఁబడి రంత
    ||వినరే||

3.  వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా
    ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ
    ||వినరే||

4.  ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా
    మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని
    దయచేత
    ||వినరే||

5.  మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో
    మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు
    కా నందమును గల్గు
    ||వినరే||

** ENGLISH LYRICS **

Vinarae Yaposthalula Kaaryamul Kraisthavulanu Vaari Kavi Yentho Dhairyamul
Manasu Lokkati Jaesi Koni Yatlu Praardhimpa Ghana Muga Vimalaathma
Chanudhenche Vaaripai
||Vinarae||

1. Paramandalamunundi Vachchenu Pedda Karuvalivale Shabdha Michchenu Thira
Muga Vaara Lan Dharu Goodi Yunna Man Dhira Mella Ninde Ban Dhuramai
Thannaadhamu
||Vinarae||

2. Analaarchulanu Deepthi Minchuchu Beeta Lagu Jihvalvale Ganupinchuchu
Ghanamuga Nokkokka Janunipai Navi Nilva Ganu Parishuddhaathmachae Thanu
Nimpa Badiranth
||Vinarae||

3. Vaaranya Bhaashalathodanu Naathma Praeranamunu Jaeyu Jaadanu Dhaaraa
Lamuga Bhaashaam Tharamu Laadiri Vinna Vaari Kabburamai Vi Chaaramu Lbodamanga
||Vinarae||

4. Mundhata Vaaritula Gumpuga Modha Mandhuchu Dhaevuni Golchi Thaa
Mandharu Choodaga Vintha Vintha Panula Nandhandhu Jaesiri Dhaevuni
Dhayachaetha
||Vinarae||

5. Manamu Naa Reethiga Gumpugaa Goodi Mana Dhaevu Golvaga Bhoomilo
Manujula Kaashcharya Magu Kaaryamula Jaeya Onagoodu Manasu
Kaa Nandhamunu Galgu
||Vinarae||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------