3053) విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు

** TELUGU LYRICS **

    విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు
    నెనరుచే ననుఁ గావు మెప్పుడు 
    ||విన రమ్ము||

1.  ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే
    తెంతు నంటివి
    ||విన రమ్ము||

2.  మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ
    దెరవుఁ దెల్పి నావు నీవెగా
    ||విన రమ్ము||

3.  మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ
    దు రాత్ముని నాపై
    ||విన రమ్ము||

4.  సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన
    నుర్వి లేదుగా
    ||విన రమ్ము||

5.  కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి
    నడుపు మరణావధికి
    ||విన రమ్ము||

6.  వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి
    యనుభవంబుఁ గలుగఁ జేయవే
    ||విన రమ్ము||

7.  దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె
    నేఁ పాప నరుఁడను
    ||విన రమ్ము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------