** TELUGU LYRICS **
వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ
జిత్రమొక్క పని వచించెద
జిత్రమొక్క పని వచించెద
||వినరె||
1. మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన
మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు
||వినరె||
2. ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు
వాసముండి రెలమితోడను

3. పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు
రోగ భరితుఁడయ్యెను

4. వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి
రపుడు నాతు లిరువురు

5. తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ
డైన క్రీస్తుఁ డరిగె నచటికి

6. యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి
మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను

7. కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని
కతన వ్రాలె లాజరు

8. పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట
మార్త పలికినట్లు సుదతి పలికెను

9. అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు
రాలితోడ నపుడు నడిచెను

10. నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి
తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను

11. యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ
గంపు పట్టి యుండదా

12. దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని
తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను

13. లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా
రవంబుఁ బూని పల్కెను

14. మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక
హర్షలైరి పెదజనంబుతో

15. కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు
యేసునాధు ననుసరించిరి

16. కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు
నిలిపి యతనియందు మనుట మేలగున్

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :