3459) స్నేహమై ప్రాణమై వరించే దైవమై

** TELUGU LYRICS **

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

జగతిన వెలసి, మనసున నిలచి
కోరె నన్ను దైవము
లోకమందు జీవమాయె చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె కనికరించే బంధమాయె
ఎంత ప్రేమ యేసయా నన్ను నీలో జీవించనీ

తలపున కొలువై మనవుల బదులై
చేరె నన్ను నిరతము
కలతలన్నీ కరిగిపోయే భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె తరిగిపోని భాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయా నన్ను నీలో తరియించనీ

స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post