3212) సత్తువ భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించిన దేవుడు

** TELUGU LYRICS **

    సత్తువ భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు..
    ఫలములనాసించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు (2)
    ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు
 (2)
    ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?
 (2)

1. ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు
 (2)
    చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు
 (2)
    తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు
 (2)
    ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?
 (2)

2.  వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా
 (2)
    ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే
 (2)
    మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా
 (2)
    ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..?
 (2)

** ENGLISH LYRICS **

Sathuva Bhoomilo Shreshtamaina Draaksha Theegalanu Naathinchina Dhevudu, Neevu Phalisthe Santhoshisthaadu..
Phalamulanaasinchina Paraloka Thandri - Therichoochuchunnaadu Nee Vaipu (2)
Prematho Ninu Penchina Priya Thotamaali - Parikshinchuchunnaadu Nee Kaapu (2)
Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamutho Chelagaatamaa..? (2)

1. Aigupthunundi Periki Thacchinaadu - Sanghadraakshathotalo Ninnu Naathinaadu (2)
Chuttu Thravvi Eruvu Vesi - Neeruposhinaadu (2)
Thana Svaasthyamugaa Ninu - Prathyekaparachinaadu (2)
Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamutho Chelagaatamaa..? (2)

2. Vedhakinapudu Nee Yoddha Phalamulaekayunte - Aakulatho Ninu Choosi Thandri Santhasinchunaa (2)
Ivvabadina Samayamulo - Vardhillakunte (2)
Modulaanti Ninnu Inka - Narikivaeyakundunaa (2)
Phaliyinchakunduta Neeku Nyaayamaa - Yajamaani Sahanamutho Chelagaatamaa..? (2)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------