** TELUGU LYRICS **
సత్యమునకు మేము సాక్షులము
క్రీస్తుకు మేము సాక్షులము (2)
రోషముగల దేవుని ప్రజలం
సత్యము కలిగి జీవిస్తాం
రోషముగల దేవుని ప్రజలం
సత్యము కొరకు మరణిస్తాం
హోసన్నా హోసన్నా - హోసన్నా హోసన్నా
హోసన్నా.. హోసన్నా.. హోసన్నా...
||సత్యమునకు||
ఉమ్ములూసినా - ముఖము త్రిప్పము
ముళ్ళు గ్రుచ్చినా - తలను వొంచము
కొరడ విసిరినా - వెనుక తిరుగము
బల్లెము పొడిచినా - భయపడము (2)
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం (2)
||హోసన్నా||
మాకు మేము తగ్గించుకొంటాం
మోకాళ్ళ కన్నీళ్ళు ప్రార్ధన చేస్తాం
సిలువ సంకెళ్ళ సమర్పణ చేస్తాం
దేవుని రాజ్యము - రగిలిస్తాం
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం (2)
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------