** TELUGU LYRICS **
శతకోటి వందనాలు యేసు స్వామి నీకు
కరుణించి కాపాడుమయ్యా (2)
కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు
మా నిండు వందనాలయ్యా (2)
నీ చల్లని చూపు - మాపై నిలుపు
నీ కరుణా హస్తం - మాపై చాపు (2)
||శతకోటి||
కరుణించి కాపాడుమయ్యా (2)
కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు
మా నిండు వందనాలయ్యా (2)
నీ చల్లని చూపు - మాపై నిలుపు
నీ కరుణా హస్తం - మాపై చాపు (2)
||శతకోటి||
1. యోసేపు అన్నలంతా తోసేసినా
బానిసగా బయట అమ్మేసినా
చెయ్యని నేరాలెన్నో మోపేసినా
చెరసాలలో అతని పడేసినా (2)
చల్లంగా చూచినావు
నీ చెయ్యి చాచినావు
బాధించిన దేశానికే
ప్రధాని చేసినావు (2)
ఆ చల్లని చూపు - మాపై నిలుపు
నీ కరుణా హస్తం - మాపై చాపు (2)
||శతకోటి||
2. ఆరు మూరల జానెడైన
గొలియాతు ఎంతో ధీరుడైనా
దేవుని హృదయానుసారుడైన
దావీదును చిన్న చూపు చూసినా (2)
చల్లంగా చూచినావు
నీ చెయ్యి చాచినావు
అభిషేకమిచ్చి నీవే
రాజుగా చేసినావు (2)
ఆ చల్లని చూపు - మాపై నిలుపు
నీ కరుణా హస్తం - మాపై చాపు (2)
||శతకోటి||
గొలియాతు ఎంతో ధీరుడైనా
దేవుని హృదయానుసారుడైన
దావీదును చిన్న చూపు చూసినా (2)
చల్లంగా చూచినావు
నీ చెయ్యి చాచినావు
అభిషేకమిచ్చి నీవే
రాజుగా చేసినావు (2)
ఆ చల్లని చూపు - మాపై నిలుపు
నీ కరుణా హస్తం - మాపై చాపు (2)
||శతకోటి||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------