** TELUGU LYRICS **
తండ్రీ నాకిమ్మయా మరో అవకాశము (2)
నీప్రేమను విడచి నా ఇష్టమని తప్పిపోయిన గొర్రెనైతిని (2)
వెంటఉన్న వారందరు విడచిపోయిరి అనాధనై ఒంటరిగా మిగిలిపోతిని (2)

1. నీ చేయి విడచి తరలిపోతిని - అదుష్టుని గాడిలో చిక్కుకొంటిని
దుర్వ్యాపారాలలో భాగమైతిని - నీవిచ్చిన భాగ్యమంతా కోల్పోతిని (2)
ఆశ్రయమేలేక అల్లాడుచుంటిని కన్నీతో కడుపు నింపుకొంటిని (2)
నీ ప్రేమ బాటలో నడవాలని మరల నీ చెంతకు చేరాలని (2)
||తండ్రీ నాకిమ్మయా||
2. నీ మాటను కాదని త్రోసియుoటిని - ఇహలోక స్నేహాన్ని కోరుకొంటిని
నీకు విరోధముగా పాపము చేసితిని - నీవిచ్చిన పరిశుద్ధత కోల్పోతిని (2)
పనికిరాని పాత్రగా నేనుంటిని యోగ్యతలన్నీ నేను కోల్పోతిని (2)
నీ కనికరము తిరిగిపొందాలని మరలా నీ కుమారునిగా మారాలని (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :