2863) రండి మానవులారా రక్షకుని నమ్మండి వేగము ప్రియులారా

** TELUGU LYRICS **

    రండి మానవులారా రక్షకుని నమ్మండి వేగము ప్రియులారా రండి
    పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున
    కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను 
    ||రండి||

1.  ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి
    తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి
    పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు
    ||రండి||

2.  పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై
    మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను
    మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును
    ||రండి||

3.  పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప
    కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని
    గూర్చు యా ప్రభు నొద్దకిపుడే
    ||రండి||

4.  భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ
    నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర
    మున జేర్చు మిమ్మును నిశ్చయముగా
    ||రండి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------