2864) రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా

** TELUGU LYRICS **

    రండి యేసుని యొద్దకుఁ ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు
    రండి రండి రయమున బిలుచుచు నుండెడి రక్షకుఁ డొసఁగెను
    బ్రాణము 
    ||రండి||

1.  మీరు పాపంబులఁ ద్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి
    మీరు వచ్చినను మిమ్మును ద్రోయఁడు చేరెడు వారిని జేర్చును దన
    దరి
    ||రండి||

2.  మీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియ జనులారా పోకుఁడి యాశించి
    లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు ఘటిల్లును
    మెండగు దుఃఖము
    ||రండి||

3.  మీరేల జాలము చేసెదరు ప్రియులారా వేగ రారే కడు భాగ్య మొందెదరు
    చేర వచ్చి చిర జీవము నొందుఁ డ పార ముదంబును బడయఁగ
    దేవుఁడు
    ||రండి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------