2928) రాత్రియయ్యెన న్నెడఁబాయకు

** TELUGU LYRICS **

1.  రాత్రియయ్యెన న్నెడఁబాయకు
    ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను
    సహాయ మేమి లేనివారికి
    సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.

2.  ఏకాలంబైన నీ సహాయము
    లేక పిశాచిన్ గెల్వఁజాలను
    నీకంటె నాకు లేదుగా
    లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.

3.  నా చెంత నీవు చేరియుండఁగ
    ఏ చింతయైన నన్ను సోకునా
    ఏ శత్రువైన నన్ను గెల్చునా?
    నా శైలమా, నన్ బాసిపోకుమా.

4.  సమృద్ధుఁడు సహాయుఁ డాయెను
    ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా?
    సమాధి నీకు జయమబ్బునా?
    మా మధ్యమున్ సర్వేశ పాయకు.

5.  రేవు నేఁ జేరఁబోవు వేళలోన్
    కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్
    చావు జీవంబులందు నైనను
    నీవు తోడై నన్ బాసిపోకుము.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------