2927) రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు నామం

** TELUGU LYRICS **

    రాత్రింబవళ్లు పాడెదను
    యేసు నామం - క్రీస్తు నామం

1.  పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి
    పరమునుండి ధరకేతెంచి - ప్రాణమున్ బలిగా నిచ్చె

2.  ఎన్నిక లేని చిన్నమంద - భయపడకు నీవిలన్
    ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్

3.  పాప కూపమునందు నేను - పడి చెడి యుండగా
    గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను

4.  నీతి హేనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి
    నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను

5.  పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి
    వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్

6.  పరమందు దూతలు - వింత పొందునట్లుగా
    ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు?

7.  దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్
    చిన్నమందగా జేసి - రాజ్యమేల జేసెన్

8.  ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్
    ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------