2974) లోకం జీవం మరణంబైనన్ సకలము మీవె నిజం

** TELUGU LYRICS **

    లోకం, జీవం, మరణంబైనన్
    సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్

1.  ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను
    వాస్తవముగా సమస్తము మీవె - మీరేసుని వారు

2.  తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో
    కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు

3.  హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు
    పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును

4.  అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము
    రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు

5.  అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును
    యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు

6.  మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు
    వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు

7.  జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా
    ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------