** TELUGU LYRICS **
లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము
సుందర వస్త్రముల ధరించు - పరిశుద్ధ పట్టణమా
సుందర వస్త్రముల ధరించు - పరిశుద్ధ పట్టణమా
1. నిష్కళంక యెరూషలేమా - ఇంకెన్నటికి నీ మధ్యకు
సున్నతి పొందని అపవిత్రులును - లోనికి రారెన్నడు
2. లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది
యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము
యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము
3. మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను
అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్
అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్
4. మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును
అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు
అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు
5. అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము
మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు
మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
------------------------------------------------------------------