** TELUGU LYRICS **
పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం
బొనర్చుట పరమ విధియని చూపుమా
బొనర్చుట పరమ విధియని చూపుమా
||పరమ||
1. ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ
రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా
||పరమ||
2. భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే
వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా
||పరమ||
3. కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల
యాశ్రయముల నంటి పరామర్శించుమా
3. కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల
యాశ్రయముల నంటి పరామర్శించుమా
||పరమ||
4. లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ
దీవెనల సమకూర్చుమా
4. లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ
దీవెనల సమకూర్చుమా
||పరమ||
5. యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర
తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా
5. యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర
తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా
||పరమ||
6. గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ
గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా
6. గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ
గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా
||పరమ||
7. దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే
రోగములు మటు మాయ మగు నని కరపుమా
7. దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే
రోగములు మటు మాయ మగు నని కరపుమా
||పరమ||
8. దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ
మగు నీ దేవళములుగ మార్చుమా
8. దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ
మగు నీ దేవళములుగ మార్చుమా
||పరమ||
** ENGLISH LYRICS **
Parama Vaidhyuda Bharatheeyula Vyadhi Baadhala Baapumaa Parula Kupachaaram
Bonarchuta Parama Vidhiyani Choopumaa
||Parama||
1. Prematho Vaidhyulunu Dhadhulu Pempu Bondhagajeyumaa Graama
Rogula Kaanchi Vaariki Kshemamunu Dhaya Cheyumaa
||Parama||
2. Bharatha Khandamu Nandhu Vaidhyapu Badulanu Nelakolpumaa Paraga Neeve
Vaidhya Shaalala Paalanambu Salpumaa
||Parama||
3. Kunti Gruddi Mooga Shaalala Koormitho Dharshinchumaa Yantu Rogula
Aashrayamula Nanti Paraamarshinchumaa
||Parama||
4. Lekkaleni Garbhavathula Akkaralanu Deerchumaa Dhikku Leni Biddhalaku Nee
Dheevenala Samakoorchumaa
||Parama||
5. Yanthrashala Ganulayandhu Nalayu Vaaralam Brovumaa Manthra
Thanthramu Landhu Chikku Namaayakulanu Gaavumaa
||Parama||
6. Graama Vaidhyu Seva Jesedi Ghanula Paripaalinchumaa Graamavaasula
Goolchu Vyaadhula Kaanchi Nirmoolinchumaa
||Parama||
7. Dhurabhimaana Moodha Bhakthini Dhwaraga Dhoora Parachumaa Mariyu Shuchiche
Rogamulu Matu Maaya Magu Nani Karapumaa
||Parama||
8. Dehashuddhini Jitthashuddhini Desha Janulaku Goorchumaa Dehamula Bara Shuddha
Magu Nee Devalamuluga Maarchumaa
||Parama||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------