1910) పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు

** TELUGU LYRICS **

    పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ
    గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను 
    ||పరమ||

1.  వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు
    పరిసయుండు మదిని దలఁచుచున్
    ||పరమ||

2.  అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి
    పిలిచి పల్కె హితవుతోడను
    ||పరమ||

3.  బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు
    నీ బోధ నెఱుఁగుదున్
    ||పరమ||

4.  మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి
    పాప నరులు చేయరు
    ||పరమ||

5.  అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు
    నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను
    ||పరమ||

6.  క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు
    నిజము క్రీస్తు పల్కెను
    ||పరమ||

7.  వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను
    తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను
    ||పరమ||

8.  అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న
    మోక్ష రాజ్య మొంద రనుచును
    ||పరమ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------