1827) నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది

** TELUGU LYRICS **

    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
    స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

1.  శోభ కలిగిన - ఆ దివ్య నగరము
    వర్ణింప శక్యము - కానిదియే (2)
    బహు సహస్రముల - సూర్యుని కంటె (2)
    ప్రజ్వలించుచున్నది - మహిమవలెను 
    ||నూతన యెరుషలేమ్||

2.  పరిపూర్ణమైన -సౌందర్యమును
    పృథ్వికి - ఆనందముగాను (2)
    భూరాజులందరు - మహిమ తెచ్చెడి (2)
    మహిమగల నగరము - ఇదియే
    ||నూతన యెరుషలేమ్||

3.  ధగధగ మెరయు - సూర్యకాంతం వలె
    జ్వలించుచున్న- దైవనగరమందు (2)
    నీతిమంతులే - సూర్యునివలెను (2)
    నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
    ||నూతన యెరుషలేమ్||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------