1595) నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు

** TELUGU LYRICS **

    నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల
    నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు 
    ||నిన్ను||

1.  నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి
    నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని
    ||నిన్ను||

2.  త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి
    మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను
    ||నిన్ను||

3.  నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా
    ననుఁ గాచిన వాఁడవు నీవు గావా ఓ నా తండ్రి
    ||నిన్ను||

4.  ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత
    సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని
    ||నిన్ను||

5.  నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు
    చేవ గలుగఁ జేయఁ గలవు
    ||నిన్ను||

6.  అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను
    సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి
    ||నిన్ను||

7.  నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి
    నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి
    ||నిన్ను||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------