1769) నీవు తడితే తలుపు తీయనా ప్రభు


** TELUGU LYRICS **

నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2)       
||నీవు||

పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) 
||నీవు||

తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట (2)
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) 
||నీవు||

విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2)
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) 
||నీవు||

** ENGLISH LYRICS **

Neevu Thadithe Thalupu Theeyanaa Prabhu
Naalo Neevunte Inkela Naaku Bhayam (2)         
||Neevu||

Paapamutho Nindiyunna Naa Brathukunu
Parishuddha Parichaavu Naa Yesayyaa
Paapamulo Jeevinchuchunna Naapai
Prema Choopi Naa Thalupu Thattaavayyaa (2)
Naa Cheekati Brathukulo Velugunu Nimpi
Nannu Nadipinchaga Vachchaavayyaa (2) 
||Neevu||

Therichaanu Naa Thalupulu Raavaa Prabhu
Ika Nannu Veedi Ninnu Vellanivvanu
Naalona Neevundi Povaali
Neethone Nadavaali Ika Meedata (2)
Rakshanane Kedemu Chetha Patti
Prathi Thalupunu Thatti Ninnu Mahima Paracheda (2) 
||Neevu||

Viluvaleni Nannu Neevu Enchukontivi
Vaakyamane Dhyaanamutho Nannu Nimpumaa
Swasthathane Varamula Dayacheyumaa
Kada Varaku Parugedudunu Nee Baatalo (2)
Ella Velalaa Naatho Undi Nannu
Cheyi Patti Nadipinchu Naa Yesayyaa (2) 
||Neevu||

----------------------------------------------
CREDITS : ఎం మార్క్ (M Mark)
----------------------------------------------