1429) నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా


** TELUGU LYRICS **

నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా 
నీ మందిరాన నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపూమయా 
||నాతో||
యేసయ్యా...ఆ..ఆ.. యేసయ్యా...ఆ..ఆ.. యేసయ్యా...ఆ..ఆ.. 
యేసయ్యా... యేసయ్యా (2)

కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా 
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా 
నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో 
నిత్యము నను నడిపించుమయ్యా
||యేసయ్యా||

నావారే నన్ను నిందించువేళ - నను విడచి పోబోకుమయ్యా 
ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేరి ఓదార్చుమయ్యా 
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై 
నిత్యము నను నడిపించుమయ్యా
||యేసయ్యా||

నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా 
సాతాను నన్ను బంధించువేళ - ననుచేరి విడిపించుమయ్యా 
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో 
నిత్యము నను నడిపించుమయ్యా
||యేసయ్యా||

---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------