1483) నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున

** TELUGU LYRICS **

    నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున
    నడుచుటయే ఆనంద జీవితము 
    ||నా ప్రియ||

1.  లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి
    పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ 
    ||నా ప్రియ||

2.  కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే
    యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను
    ||నా ప్రియ||

3.  ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే
    జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ
    ||నా ప్రియ||

4.  నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని
    నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్
    ||నా ప్రియ||

5.  అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది
    నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు
    ||నా ప్రియ||

6.  దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో
    ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును
    ||నా ప్రియ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------