** TELUGU LYRICS **
నా కింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువై
యుండు నాకు గల యున్నత కతమ్మే నాధుఁ డగును నేను మురియు
శ్రీకరంబగు నామ మేది సిల్వఁబడ్డ యేసు క్రీస్తే

||నా కింత||
1. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు నెత్తెన్
పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును
చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే

2. నేను నా విధు లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ జ్ఞాన మిచ్చుచునుండు
జ్ఞాని యెవ్వారు వాని యెడల నను యధార్థ పరునిగాఁ గావించి యవినా
చే నెరవేర్పించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే

3. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి యెవరు నా శోకంబు నెగురఁ
గొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను నీడ్చి సేదను దీర్చి మనసు
చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే

4. మరణంలో నాకుఁ జిర జీవ మెవ్వారు మరణంబునకె గొప్ప మరణ
మెవ్వారు విరివిలేని మహిమ సేలు దరిని నుండఁగ నన్నుఁ జెంతను
స్థిరముగ స్థాపించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే

5. నన్ను రక్షింప మరణం బొందియు సమాధి నెన్నటికిని గెల్చి యున్న
ప్రభునందు నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును
చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :