2422) మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా


** TELUGU LYRICS **

మాట్లాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా 
నీ మాటలే జీవపు ఊటలు - నీ పలుకులే ప్రాణాధారాలు (2)
||మాట్లాడు||

సమరయ స్త్రీతో మాటాడావు 
సకల పాపములు హరియించావు (2) 
జీవ జలములు త్రావనిచ్చావు (2) 
జీవితమునే మార్చివేసావు (2)
||మాట్లాడు||

చచ్చిన లాజరును చక్కగ పిలిచావు 
బయటకు రమ్మని ఆదేశించావు (2)
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు (2) 
మళ్ళీ బ్రతుకును దయచేసావు (2)
||మాట్లాడు||

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా)
---------------------------------------------------------------------------