2321) మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

** TELUGU LYRICS **

    మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
    నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె

1.  తృణీకరింపబడె విసర్జింపబడెను
    దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను

2.  మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
    మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి

3.  మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
    మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె

4.  గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
    అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును

5.  దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
    తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్

6.  ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట
    యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్

7.  సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
    సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ

** ENGLISH LYRICS **

Manakai Yesu Maraninche Mana Paapamula Korakai
Nithyajeevithamu Nichchutake Sathyundu Sajeevudaaye

1. Thruuneekarimpabade Visarjimpabadenu
Duhkhaa Kraanthudaaye Vyasanamula Bharinchenu

2. Mana Vyasanamula Vahinchen - Mana Duhkhamula Bharinchen
Mana Mennika Cheyakaye - Mana Mukhamula Drippithimi

3. Mana Yathikramamula Koraku - Mana Doshamula Koraku
Mana Naathudu Shikshanondhe - Manaku Swasthatha Kalige

4. Gorrelavale Thappithimi - Parugidithimi Manadhaarin
Arudhenche Kaapariyai - Arpinchi Praanamunu

5. Dhourjanyamu Nondhenu - Baadhimpabadenu
Thananoru Theruvaledhu - Manakai Krayadhanamiyan

6. Edhirimpa Ledhevarin - Ledhe Kapatamu Nota
Yehova Nalugagotten - Mahaavyaadhini Kaliginchen

7. Siluvalo Vrelaaden - Samaadhilo Nundenu
Sajeevundai Lechen - Sthothramu Hallelujah

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------