2322) మన జీవితమంతయు అనుక్షణము యుద్ధమే

** TELUGU LYRICS **

    మన జీవితమంతయు - అనుక్షణము యుద్ధమే
    ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను

1.  ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి
    యేసుడే నడుపును మనలను - తన మార్గమునందున

2.  ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
    క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము

3.  ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
    ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును

4.  ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన
    ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------