** TELUGU LYRICS **
మన యేసు మరణస్మా రణవిందులోఁబాలు గొనరండు ప్రియులార
వినయమానసులై మన దోష చయమెల్లఁ దనమేన ధరియించు కొనిమనల
గావ నా యన పడిన శ్రమలెంచి

||మన యేసు||
1. మరల మన మధ్యకా పరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనము
మఱవకుండుటకై స్థిర భక్తి నద్దాని జరిగింపవలెనంచు గురుతరంబగు
నాజ్ఞ నెఱపితాఁ జనెఁగాన
||మన యేసు||
2. తినుఁడిది యె నా దివ్య తనువంచు నొక రొట్టి యను వ్రచ్చి ప్రభుఁ
డిచ్చె ననుబంధుతతికి ఘన శ్రద్ధదానిఁగై కొని మనము భుజియింప
నొన గూడు జిరజీవ మనుమాన మిఁకనేల

3. ఆ రీతి నిజరక్త ధారయై వెలయు ద్రా క్షారసము నిచ్చె నిం పార
గొను డనుచుఁ గోరి యా మధుధారఁ గ్రోలిన మనకుక్షి దోరమౌ జీవంపుధార
లుద్భవ మొందు

4. ప్రభు భక్తి నెవఁడు దై వభయంబు లేక య నుభవించు వానిక
శుభమౌ నా మీఁద విభవంబు దొలఁగురో గభయంబు చేకూరు శుభ
మవ్వానికి నెపుడు లభియింపదని తెలిసి

5. మిము మీరె తగురీతి గమనించి పరిశోధ నము చేసికొని మీ పాపము
లోప్పుకొనుచు నమితార్తిఁబశాత్తా పముఁబొంది యీ విందు క్రమము
బాటింప క్షే మము మీకు సిద్ధించు

6. దురితాంధకార భా స్కరుఁడు సద్గురుఁడేసు పరమవిందున కిది యను
ప్రాసంబని యెఱిఁగి ఉరణశాబకరక్త సరి దంతఃపరిపూతాం
బరులైసత్కార్యత త్పరులై బంధురమతులై

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :