2330) మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు

** TELUGU LYRICS **

    మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు

1.  ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన
    తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే

2.  అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన
    కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే

3.  మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
    తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే

4.  నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది
    పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే

5.  కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
    మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------