** TELUGU LYRICS **
మన బలమైన యాకోబు దేవునికి
గానము సంతోషముగా పాడుడీ
అను పల్లవి: పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి
సితార స్వరమండలము వాయించుడి

1. అమావాస్య పున్నమ పండుగ దినములందు
కొమ్మునూదుడి యుత్సాహముతోడ
యాకోబు దేవుడు నిర్ణయించిన - ఇశ్రాయేలీయుల కది కట్టడ

2. తానైగుప్తులో తిరిగినప్పుడు - యోసేపు సంతతికి సాక్షముగ
నిర్ణయించెను దేవుడు అచ్చట - నే నెనుగని భాషను నే వింటిని

3. తమభుజము నుండి బరువు దింపగ మోతగంపల భారము దప్పెను
నీవాపదయందు మొఱపెట్టగా - విడిపించిన యెహోవాను నేనే

4. ఉరుము దాగుచోటులో నుండినే - ఉత్తరమిచ్చి నిన్ను శోధించితిని
మెరీబా జలముల యొద్ద నిన్ను - నా ప్రజలారా నా మాట వినుడి

5. ఇగుప్తు దేశములో నుండి నిన్ను - రప్పించిన యెహోవా దేవుడను
నీవు నీ నోరు బాగుగా తెరువుము - నేను నింపెదను మంచి వాటితో

6. అతి శ్రేష్ఠమైన గోధుమలను - అనుగ్రహించి పోషించెద నిన్ను
కొండ తేనెనిచ్చి కడు ప్రేమతో - తృప్తి పరచెదను నిత్యముగా

7. అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట - వినిన పక్షాన ఎంత మేలగు
అన్యదేవతల నెవ్వరికిని - నీవు ఎన్నడు పూజ చేయరాదు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :